కలకలం రేపిన వరుస బాంబు బెదిరింపులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం, రాజ్‌భవన్‌కు కూడా బెదిరింపు కాల్స్ రంగంలోకి బాంబు స్క్వాడ్.. బెదిరింపు ఉత్తదేనని తేల్చిన అధికారులు తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఉదయం వరుసగా వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ నటి త్రిష సహా పలువురు ప్రముఖులే లక్ష్యంగా ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బెదిరింపులకు గురైన ప్రాంతాలు అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆళ్వార్‌పేటలోని నివాసం, నటి త్రిష తేనాంపేటలోని ఇల్లు, టి.నగర్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంతో పాటు, రాజ్‌భవన్ (గవర్నర్ నివాసం), నటుడు-రాజకీయ నాయకుడు ఎస్వీ…
Read More