24 గంటల్లో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం ప్రకాశం బ్యారేజ్‌కు రెండో ప్రమాద హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని వర్షాలు, వరదలు ఒకేసారి కలవరపెడుతున్నాయి. ఒకవైపు ఉత్తర కోస్తాకు దగ్గరలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం, ఉత్తర కోస్తా పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్…
Read More