జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకే పాత స్టాక్‌పై కొత్త ధరల స్టిక్కర్లకు అనుమతి డిసెంబర్ 31 వరకు ధరల సవరణకు అవకాశం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు ఫలితంగా ధరల తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు చేరేలా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వస్తువులపై జీఎస్టీ రేట్ల తగ్గింపుకు అనుగుణంగా కొత్త ధరల స్టిక్కర్లను అతికించేందుకు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వినియోగదారులకు తగ్గిన ధరల ప్రయోజనాన్ని త్వరగా పొందేలా చేస్తుంది. సాధారణంగా ఒకసారి మార్కెట్లోకి వచ్చిన వస్తువుల ఎమ్మార్పీ (గరిష్ఠ చిల్లర ధర)ని మార్చడానికి వీలుండదు. కానీ, ఈ నెల 22 నుంచి జీఎస్టీ తగ్గింపు అమలులోకి రానున్నందున, అప్పటికే ఉన్న పాత స్టాక్‌పై కూడా తగ్గిన ధరలను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీలు పాత…
Read More