నదిలో కారును తోసేసి తాను చనిపోయినట్లు నాటకం 17 రోజుల తర్వాత మొబైల్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో అరెస్ట్ డెత్ సర్టిఫికెట్‌తో లోన్ మాఫీ అవుతుందని ఆశపడినట్లు వెల్లడి కోట్ల రూపాయల బ్యాంకు రుణాన్ని ఎగవేసేందుకు ఓ బీజేపీ నేత కుమారుడు చనిపోయినట్లు నాటకమాడాడు. సినిమాను తలపించేలా సాగిన ఈ నాటకానికి పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తెరదించారు. అయితే, చివరకు చట్టంలోని లొసుగు కారణంగా అతనికి ఎలాంటి శిక్ష పడకుండానే ఇంటికి వెళ్ళిపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన బీజేపీ నేత మహేశ్ సోనీ కుమారుడు విశాల్ సోనీ పలు బ్యాంకుల నుంచి సుమారు రూ.1.40 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే మార్గం లేక, తాను చనిపోయినట్లు నమ్మిస్తే రుణాలు రద్దవుతాయని పథకం వేశాడు. ఈ క్రమంలో తన కారును కలిసింధ్ నదిలోకి…
Read More