India-Russia : పాక్ JF-17 జెట్లకు రష్యా ఇంజిన్లు – భారత్‌కే ప్రయోజనం” అంటున్న రక్షణ నిపుణులు.

Political Storm in India over Russia's JF-17 Engine Supply; Moscow Expert Dismisses Criticism.

పాకిస్థాన్ జేఎఫ్-17 జెట్లకు రష్యా ఇంజిన్ల సరఫరా ఈ ఒప్పందం భారత్‌కే ప్రయోజనకరమన్న రష్యా రక్షణ నిపుణులు ఇంజిన్ల కోసం చైనా, పాక్ ఇంకా రష్యాపైనే ఆధారపడుతున్నాయని వెల్లడి జేఎఫ్-17 ఫైటర్ జెట్ల కోసం పాకిస్థాన్‌కు రష్యా ఆర్డీ-93 ఇంజిన్ల సరఫరా అంశంపై భారత్‌లో రాజకీయంగా దుమారం రేగుతున్న సమయంలో, రష్యా రక్షణ రంగ నిపుణులు ఒక ఆసక్తికరమైన విశ్లేషణను ముందుకు తెచ్చారు. ఈ ఒప్పందం పాకిస్థాన్ కంటే భారత్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని, భారత విపక్షాల విమర్శలు అర్థరహితమని వారు స్పష్టం చేశారు. రష్యా నిపుణుడి విశ్లేషణ మాస్కోలోని ప్రముఖ ప్రిమకోవ్ ఇన్‌స్టిట్యూట్‌లో దక్షిణాసియా విభాగం అధిపతి ప్యోత్ర టోపిచ్కనోవ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “రష్యా నుంచి పాకిస్థాన్‌కు ఇంజిన్లు వెళుతున్నాయన్న వార్తల నేపథ్యంలో వస్తున్న విమర్శలు సమర్థనీయం కావు. నిజానికి ఈ ఒప్పందం…

Read More