ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం అక్రమంగా తరలించే టపాసులతోనే ఎక్కువ నష్టమని వ్యాఖ్య దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి మేలు చేసే ‘గ్రీన్ క్రాకర్స్’ను పరిమితంగా కాల్చుకునేందుకు అనుమతినిస్తూ, ఈ నెల 18 నుంచి 21 వరకు (నాలుగు రోజుల పాటు) వెసులుబాటు కల్పించింది. అయితే, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోకి బయటి నుంచి టపాసులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. “బయటి ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించే టపాసుల వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. మనం పర్యావరణంతో రాజీ పడకుండా, సంయమనం పాటిస్తూ సమతుల్య విధానాన్ని అనుసరించాలి” అని…
Read More