ధనత్రయోదశి నాటికి తులం బంగారం రూ.1.3 లక్షలకు చేరే సూచనలు 2026 ఆరంభంలో రూ.1.5 లక్షల మార్కును దాటవచ్చని నిపుణుల అంచనా ఎంసీఎక్స్ లో రూ.1.23 లక్షలు దాటిన పసిడి ఫ్యూచర్స్ ధర బంగారం ధరలు అసాధారణ స్థాయిలో దూసుకుపోతున్నాయి. పసిడి ప్రియులకు దిగ్భ్రాంతి కలిగించేలా, ఈ ధనత్రయోదశి పండుగ సమయానికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.3 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతకుమించి, 2026 ప్రారంభం నాటికి ఈ ధర రూ.1.5 లక్షల మైలురాయిని కూడా అధిగమించవచ్చని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో డిసెంబర్ కాంట్రాక్టు 10 గ్రాముల బంగారం ధర 1.62 శాతం పెరిగి రూ.1,23,313…
Read More