అసెంబ్లీ లాబీలో మార్షల్స్ తీరుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మార్షల్ దురుసు ప్రవర్తన మీడియాతో మాట్లాడుతుండగా నెట్టేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మార్షల్ ఎమ్మెల్యే పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా?” అంటూ సిబ్బందికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటన గురువారం అసెంబ్లీ లాబీలో చోటు చేసుకుంది. మంత్రి లోకేశ్ ఛాంబర్ వెలుపల టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో, అక్కడికి వచ్చిన ఓ మార్షల్ లాబీలో ఉండకూడదని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే నరేంద్రపై చేయి వేసి పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు.…
Read More