UPI : భారత్‌లో డిజిటల్ చెల్లింపుల విప్లవం: యూపీఐ రికార్డు లావాదేవీలు

UPI Creates New Record: Crosses 2,000 Crore Transactions in August

ఆగస్టులో 2000 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు ఒక్క నెలలోనే రూ.24.85 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు యూపీఐ మార్కెట్‌లో ఫోన్‌పేదే అగ్రస్థానం దాదాపు 49 శాతం వాటాతో దూసుకెళ్తున్న ఫోన్‌పే భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మరోసారి అద్భుతమైన రికార్డును సృష్టించింది. గత ఆగస్టు నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు మొదటిసారిగా 2000 కోట్ల మైలురాయిని అధిగమించాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ లావాదేవీల మొత్తం విలువ సుమారు రూ. 24.85 లక్షల కోట్లుగా నమోదైంది. ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యం యూపీఐ మార్కెట్‌లో ప్రధాన పోటీదారులు అయిన ఫోన్‌పే, గూగుల్ పే తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ పోటీలో ఫోన్‌పే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.…

Read More