ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం అక్రమంగా తరలించే టపాసులతోనే ఎక్కువ నష్టమని వ్యాఖ్య దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి మేలు చేసే ‘గ్రీన్ క్రాకర్స్’ను పరిమితంగా కాల్చుకునేందుకు అనుమతినిస్తూ, ఈ నెల 18 నుంచి 21 వరకు (నాలుగు రోజుల పాటు) వెసులుబాటు కల్పించింది. అయితే, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోకి బయటి నుంచి టపాసులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. “బయటి ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించే టపాసుల వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. మనం పర్యావరణంతో రాజీ పడకుండా, సంయమనం పాటిస్తూ సమతుల్య విధానాన్ని అనుసరించాలి” అని…
Read MoreTag: Diwali
Diwali : దీపావళి పండుగ: బహుమతులపై కేంద్రం ఆంక్షలు
దీపావళి సందర్భంగా ఆర్థిక శాఖ నిర్ణయం మంత్రిత్వ శాఖలకు తాజాగా ఆదేశాల జారీ ఆర్థిక క్రమశిక్షణ కోసమే నిర్ణయమని వెల్లడి దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ శాఖల ఖర్చులపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ సంబరాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయవద్దని స్పష్టం చేసింది. దీపావళి మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఏ పండుగ సందర్భంలోనూ ప్రభుత్వ ఖజానా నుంచి బహుమతుల కోసం నిధులు వెచ్చించవద్దని అన్ని మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం, అనవసరమైన వ్యయాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆర్థిక శాఖ తెలిపింది. ప్రభుత్వ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ, తాజాగా వ్యయ విభాగం ద్వారా ఈ నోటీసులను జారీ…
Read MoreDiwali | ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ | Eeroju news
ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Diwali ఏటా అక్టోబర్- నవంబర్ వస్తే చాలు. దేశమంతటా వాతావరణం ఒకలా ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం మరోలా ఉంటుంది. జాతీయ స్థాయిలోనే అత్యధిక స్థాయిలో పొల్యూషన్ ఉండే దిల్లీలో ఈసారి పండక్కి ముందే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు చిన్నా పెద్దా సహా అందరి దృష్టి దీపావళిపైనే ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు జోరుగా అమ్మకాలు ప్రారంభించనున్నాయి. అయితే ఊహించని రీతిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. దీపావళికి టపాసులు ఎవరూ కాల్చొద్దని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అసలు టసాసుల షాపులు సైతం పెట్టొకూదంటూ ఆర్డర్స్ పాస్ చేసింది.ఫలితంగా ఈ దీపావళిని కొవ్వొత్తులతో జరుపుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. ఇదా ఎందుకు…
Read More