జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోళ్ల జోరు 25 శాతానికి పైగా పెరిగిన ఈ-కామర్స్ అమ్మకాలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించడం వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా డిజిటల్ చెల్లింపులు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వృద్ధి చెందాయి. డిజిటల్ లావాదేవీల్లో 10 రెట్లు పెరుగుదల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జీఎస్టీ రేట్లు తగ్గిన తొలిరోజైన సెప్టెంబర్ 22న ఏకంగా రూ.11 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు రోజు (సెప్టెంబర్ 21న) నమోదైన డిజిటల్ చెల్లింపుల విలువ కేవలం రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే ఈ లావాదేవీలు ఏకంగా 10 రెట్లు పెరగడం…
Read More