NiravModi : పీఎన్‌బీ కుంభకోణం నిందితుడు నీరవ్ మోదీ అప్పగింత: కీలక పురోగతి

Key Breakthrough in PNB Scam: Nirav Modi to be Extradited from UK on November 23

పీఎన్‌బీ స్కామ్ నిందితుడు నీరవ్ మోదీ అప్పగింతలో కీలక పరిణామం నవంబర్ 23న భారత్‌కు తీసుకొచ్చే అవకాశం బ్రిటన్ ప్రభుత్వానికి భారత్ అధికారిక హామీ వేల కోట్ల రూపాయల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ను మోసగించి, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత విషయంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, అంతా అనుకున్నట్లు జరిగితే, నవంబర్ 23న నీరవ్ మోదీని బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది నిజమైతే, పరారీలో ఉన్న ఈ ఆర్థిక నేరగాడిని స్వదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్‌లో చాలాకాలంగా చేస్తున్న న్యాయపోరాటం ఫలించినట్లే అవుతుంది. బ్రిటన్‌కు భారతదేశం ఇచ్చిన కీలక హామీ ఈ అప్పగింత ప్రక్రియ వేగవంతం కావడానికి భారత ప్రభుత్వం ఇటీవల బ్రిటన్‌కు ఇచ్చిన…

Read More