సరళతరమైన పీఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనలు 13 రకాల పాక్షిక విత్‌డ్రాలు ఒక్కటిగా విలీనం కేవలం ఏడాది సర్వీసుతోనే 75 శాతం డబ్బు ఉపసంహరణ ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ డబ్బు ఉపసంహరణ నిబంధనలను సరళతరం చేసింది. ఇకపై ఉద్యోగులు కేవలం 12 నెలల సర్వీసు పూర్తి చేసిన వెంటనే తమ పీఎఫ్ ఖాతాలోని 75 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను రద్దు చేసి, వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాత విధానంలో ఉన్న సంక్లిష్టమైన అర్హత ప్రమాణాలు, వేర్వేరు సర్వీసు కాలపరిమితుల వల్ల అనేక…
Read More