విజయంపై తన ఆలోచనలు మారాయన్న సమంత గతంలో నంబర్లు, లెక్కలతోనే బతికానని వెల్లడి ఒకప్పుడు వరుస సినిమాలు, బ్లాక్‌బస్టర్ హిట్లు, టాప్ జాబితాలో స్థానం.. వీటినే విజయానికి కొలమానంగా భావించానని అగ్ర కథానాయిక సమంత అన్నారు. తన స్థానాన్ని ఇంకెవరైనా భర్తీ చేస్తారేమోనన్న భయంతో, తన ఆత్మగౌరవాన్ని పూర్తిగా నంబర్లతోనే ముడిపెట్టి చూశానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతగా ‘మా బంగారు తల్లి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, వ్యక్తిగత ఆలోచనలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో తన ఆలోచనా విధానం గురించి వివరిస్తూ, “గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మేదాన్ని. ఏడాదికి ఐదు సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. దాన్నే పెద్ద విజయంగా భావించి అపోహ పడ్డాను. ఎప్పుడూ…
Read MoreTag: Filmmaking
Shekhar Kammula : శేఖర్ కమ్ముల ‘కుబేర’: నాదైన మార్క్!
Shekhar Kammula : శేఖర్ కమ్ముల ‘కుబేర’: నాదైన మార్క్!:సరళమైన కథలతో సున్నితమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, ఇప్పుడు ఆయన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి భారీ తారాగణంతో ‘కుబేర’ అనే విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో, 150 రోజుల పాటు చిత్రీకరించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా, శేఖర్ కమ్ముల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘కుబేర’: ఎవరూ చేయని సాహసం! ‘కుబేర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో “సరస్వతీ దేవి తలెత్తుకుని చూసేలా ఈ సినిమా ఉంటుంది” అని తాను చేసిన వ్యాఖ్యలపై కమ్ముల స్పందించారు. “సుమారు 25 ఏళ్ల నా ప్రయాణంలో, కంటెంట్…
Read More