దీపావళి సందర్భంగా ఆర్థిక శాఖ నిర్ణయం మంత్రిత్వ శాఖలకు తాజాగా ఆదేశాల జారీ ఆర్థిక క్రమశిక్షణ కోసమే నిర్ణయమని వెల్లడి దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ శాఖల ఖర్చులపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ సంబరాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయవద్దని స్పష్టం చేసింది. దీపావళి మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఏ పండుగ సందర్భంలోనూ ప్రభుత్వ ఖజానా నుంచి బహుమతుల కోసం నిధులు వెచ్చించవద్దని అన్ని మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం, అనవసరమైన వ్యయాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆర్థిక శాఖ తెలిపింది. ప్రభుత్వ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ, తాజాగా వ్యయ విభాగం ద్వారా ఈ నోటీసులను జారీ…
Read More