Telangana : తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ ఇకపై ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా పేరు మార్పు

Key Infrastructure Change: Telangana Govt Renames Flyover Near Secretariat

‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్ గా పేరు మార్పు పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరుతో బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు హైదరాబాద్‌లోని కీలకమైన ఫ్లైఓవర్లలో ఒకటైన ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడంతో ఈ మార్పు అధికారికంగా అమల్లోకి వచ్చింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం సమీపంలో ఈ ఫ్లైఓవర్ ఉంది. ఇప్పటివరకు ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్‌గా అందరికీ సుపరిచితమైన ఈ ఫ్లైఓవర్… ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా గుర్తింపు పొందనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే ఈ మార్గంలో అధికారులు కొత్త పేరును సూచిస్తూ…

Read More