వరుసగా మూడో రోజూ కొనసాగిన లాభాల జోరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరిన సెన్సెక్స్, నిఫ్టీ లార్జ్ క్యాప్ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం, మిడ్‌క్యాప్‌లో నీరసం పండగ సీజన్‌కు స్వాగతం పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా సూచీలు లాభాల బాటలో పయనించి, 52 వారాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఫైనాన్షియల్, ఆటో, ఎఫ్‌ఎంసిజి రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పరుగులు పెట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 484.53 పాయింట్లు లాభపడి 83,952.19 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 124.55 పాయింట్లు పెరిగి 25,709.85 వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ రంగం 1.37 శాతం వృద్ధితో టాప్ పెర్ఫార్మర్‌గా నిలవగా… ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ రంగాలు కూడా…
Read More