కూటమి నేతలే క్లబ్బుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణ డీఎస్పీ విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది నిజమేనన్న గ్రంథి రాముడి పేరు పెట్టుకున్నంత మాత్రాన రాముడు అయిపోరంటూ పరోక్ష విమర్శలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భీమవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కోరారు. భీమవరంలో జరుగుతున్న పేకాట వ్యవహారంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వంలోని కొందరు నాయకులే క్లబ్‌ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని గ్రంథి ఆరోపించారు. ఈ అక్రమాలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. పేకాటపై కఠిన చర్యలు తీసుకోవాలి: గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో పేకాటపై సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రంథి శ్రీనివాస్ కోరారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నానని, ఆయన అవకాశం ఇస్తే నియోజకవర్గంలో…
Read More