గాజాలో శాంతి చర్చల ప్రభావంతో తగ్గిన సురక్షిత పెట్టుబడుల డిమాండ్ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు మార్కెట్లో ఒడుదొడుకులు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు గత రెండు నెలలుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరల జోరుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా అనుకూల పరిణామాలు, డాలర్ బలం పుంజుకోవడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడానికి మొగ్గు చూపడంతో ఈ విలువైన లోహాల ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనా, ఇండియాతో అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపించడం వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కలాంత్రీ తెలిపారు. “అంతేకాక, గాజాలో శాంతి చర్చలు సానుకూలంగా సాగుతుండటం వల్ల పెట్టుబడిదారులు లాభాలు స్వీకరిస్తున్నారు. అందుకే ధరలు తగ్గాయి” అని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గినప్పుడు,…
Read MoreTag: #GoldSilverPrice
GoldSilverPrice : ధనత్రయోదశి తర్వాత బంగారం, వెండి ధరలు ఢమాల్!
ధనత్రయోదశికి 35-40 శాతం పెరిగిన నగల అమ్మకాలు ఒక్కరోజే 7 శాతం మేర పతనమైన వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లోనూ తగ్గిన పసిడి రేట్లు పండుగ కొనుగోళ్లతో రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ధనత్రయోదశి సందర్భంగా భారీగా నగల అమ్మకాలు జరిగిన మరుసటి రోజు, మంగళవారం నాడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ (Profit Booking)కు మొగ్గు చూపడంతో పసిడి, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. సోమవారం ఆల్-టైమ్ గరిష్ఠాలను తాకిన ఈ లోహాలు, ఈరోజు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. వెండిలో భారీ పతనం దేశీయ మార్కెట్‌లో వెండి ధరలో అత్యంత భారీ పతనం కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) సమాచారం ప్రకారం, కిలో వెండి ధర ఏకంగా 7 శాతం పడిపోయింది. దీంతో కిలో వెండి…
Read More