Google : మైక్రోసాఫ్ట్ లాగే గూగుల్ విశాఖ స్వరూపాన్ని మార్చేస్తోన్న టెక్ దిగ్గజం పెట్టుబడులు – లక్ష ఉద్యోగాలు ఖాయం మంత్రి లోకేశ్

Vizag's Microsoft Moment: Google Investment to Transform Visakhapatnam, Create Over 1 Lakh Jobs - Minister Lokesh.

విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి హైదరాబాద్‌ను మైక్రోసాఫ్ట్ మార్చినట్టే విశాఖను గూగుల్ మారుస్తుందన్న లోకేశ్ ఏపీలో బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్య ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ స్వరూపమే మారిపోయినట్లు, ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ రాకతో విశాఖలో లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రాభివృద్ధిలో ఇదొక కీలక మైలురాయి కానుందని ఆయన తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ ఈ మేరకు వివరించారు. విశాఖకు కేవలం గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పనిచేసే అనేక అనుబంధ కంపెనీలు కూడా తరలివస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ భారీ…

Read More