అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగుల సామూహిక నిష్క్రమణ నేటి నుంచి లక్ష మంది ఉద్యోగులు విధుల నుంచి దూరం ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ‘డీఆర్పీ’ వల్లే ఈ పరిస్థితి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చేపట్టిన సంచలన నిర్ణయాల కారణంగా, నేటి (సెప్టెంబర్ 30) నుంచి ఏకంగా లక్ష మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులు తమ విధులకు దూరమవుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం, అమెరికా చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి ఉద్యోగులు వైదొలగడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒకే సంవత్సరంలో ఇంత మంది ప్రభుత్వ ఉద్యోగులు వైదొలగడం ఇది మొదటిసారి. ట్రంప్ సర్కార్ వ్యూహం: ‘డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్’…
Read More