పలాసలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి అడుగులు రైతులతో అవగాహన సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభ్యంతరాలు, సూచనలు వ్యక్తం చేసిన రైతులు ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి, ప్రజలందరి ఆమోదంతోనే విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష రైతులకు భరోసా ఇచ్చారు. పలాస విమానాశ్రయ నిర్మాణం నేపథ్యంలో నిన్న పలాస రైల్వే గ్రౌండ్స్‌లో పరిసర గ్రామాల రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు రైతులకు హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి భూములు సేకరించే ప్రక్రియలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, గ్రామస్థుల అభిప్రాయాలతోనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సదస్సుకు హాజరైన బిడిమి,…
Read More