ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనన్న కేటీఆర్ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల మోసాన్ని ఎండగడతాం ప్రజలకు గుర్తుచేసేందుకే ‘బాకీ కార్డులు’ తెచ్చామన్న బీఆర్ఎస్ తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ పూర్తి సన్నద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడిందని, వారి మోసాన్ని ప్రజల ముందు ఉంచేందుకే ‘బాకీ కార్డులు’ తీసుకొచ్చామని తెలిపారు. ఈరోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ‘గ్యారెంటీ కార్డుల’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను గారడీ చేసిందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించిందని,…
Read More