వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (70) కన్నుమూత పొలంలో పనులు చూస్తుండగా గుండెపోటు ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (70) గుండెపోటుతో కన్నుమూశారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో విషాదం నెలకొల్పిన ఈ ఘటన, ఆయన స్వగ్రామం ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, భాస్కర్ రెడ్డి తన పొలంలో కూలీలతో పనులు చేయిస్తుండగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తోపుదుర్తి భాస్కర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన భార్య తోపుదుర్తి కవిత, ఉమ్మడి అనంతపురం జిల్లా…
Read More