తెలంగాణ మీదుగా మూడు కొత్త హైస్పీడ్ రైలు మార్గాలు చెన్నై, బెంగళూరు మార్గాలకు ఇప్పటికే అలైన్మెంట్లు ఖరారు నేడు రైల్వే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, అమరావతిలకు అనుసంధానించే మూడు హైస్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. హైస్పీడ్ రైలు కారిడార్ల అప్డేట్స్ హైదరాబాద్-చెన్నై మార్గం: ఈ హైస్పీడ్ రైలు మార్గం నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడల మీదుగా వెళ్తుంది. కాజీపేట ద్వారా కాకుండా, ఈ కొత్త మార్గంలో తెలంగాణలో 6-7 స్టేషన్లు ఉండొచ్చు. హైదరాబాద్-బెంగళూరు మార్గం: ఈ కారిడార్ నాగ్‌పూర్-హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మించబడుతుంది. దీని కోసం మూడు అలైన్మెంట్లు ప్రతిపాదించారు. తెలంగాణలో 4-5 స్టేషన్లు ఏర్పాటు చేయాలని అంచనా…
Read More