చట్టంలోని కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ ఆదేశాలు మొత్తంగా చట్టంపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు వక్ఫ్ బోర్డులో ముస్లింలే మెజారిటీ సంఖ్యలో ఉండాలని వ్యాఖ్య వక్ఫ్ (సవరణ) చట్టం-2025పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పును వెలువరించింది. ఈ చట్టంలోని ఒక ముఖ్యమైన నిబంధనను సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితే, ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేయాలని పిటిషన్ దారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన అంశాలు: నిలిపివేసిన నిబంధన: కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే నిబంధనను కేంద్రం ఈ చట్టంలో చేర్చింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లుగా నిర్ణయించే నిబంధనలు తయారుచేసే వరకు దీనిని నిలిపివేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి స్టే నిరాకరణ: ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్…
Read MoreTag: #IndianLaw
AishwaryaRai : సెలబ్రిటీల హక్కులపై దిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు దిల్లీ హైకోర్టులో భారీ ఊరట ఐశ్వర్యారాయ్ వ్యక్తిగత హక్కులకు రక్షణ సెలబ్రిటీల హక్కులపై దిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన ఫొటోలు, పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె చిత్రాలను గానీ, వ్యక్తిగత హక్కులను గానీ దుర్వినియోగం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఆమె ప్రచార హక్కులు (ప్రమోషనల్ రైట్స్), వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) చట్టపరమైన రక్షణ కల్పించింది.అనధికారికంగా ఐశ్వర్య ఫొటోలను వాణిజ్య ప్రకటనలకు వాడటం వల్ల ఆమెకు కేవలం ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా, ఆమె…
Read More