ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం_భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం

himachal floods

డెహ్రాడూన్‌ శివార్లలో భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం సహస్రధార ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ప్రఖ్యాత టపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు ఉత్తరాఖండ్ మరోసారి ప్రకృతి ఆగ్రహానికి గురైంది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి దారితీసింది. సహస్రధార ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో డెహ్రాడూన్‌లో పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. తమ్సా నది ఉప్పొంగి ఆలయ ఆవరణలోకి ప్రవేశించింది. హనుమాన్ విగ్రహం వరకు నీరు చేరినా, గర్భగుడి మాత్రం…

Read More