బెంగళూరులో అద్దెదారుకు భారీ వాటర్ బిల్లు షాక్ సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు యజమానిని అడిగితే పిచ్చి సమాధానాలు ఇస్తున్నాడని ఆవేదన బెంగళూరులోని అద్దె గృహాలు కేవలం అధిక అద్దెలు, డిపాజిట్ల విషయంలోనే కాదు, ఇప్పుడు నీటి బిల్లుల విషయంలోనూ సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు మాత్రమే నివసించే ఇంటికి ఏకంగా నెలకు రూ.15,800 వాటర్ బిల్లు రావడంతో ఓ అద్దెదారు షాక్ అయ్యాడు. తన యజమాని ఇలా అధిక బిల్లులతో మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ, తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరుకు చెందిన ఓ అద్దెదారు తన దురనుభవాన్ని రెడిట్‌లో పంచుకున్నాడు. “ప్రతి నెలా నా యజమాని అధిక వాటర్ చార్జీలతో వేధిస్తున్నాడు” అనే శీర్షికతో…
Read More