USVisa : అమెరికా వీసా నిబంధనలు: భారతీయులకు కీలక మార్పులు

US Visa Rules: Key Changes for Indians

మూడో దేశంలో అపాయింట్‌మెంట్ పొందే వెసులుబాటు రద్దు కరోనా సమయంలో ఇచ్చిన మినహాయింపునకు తెర భారతీయ పర్యాటకులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలకమైన మార్పులు చేసింది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సొంత దేశంలో లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలో మాత్రమే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లి వీసా ఇంటర్వ్యూలను వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఇకపై ఉండదు. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది. కొత్త నిబంధన ఎందుకు? కరోనా మహమ్మారి సమయంలో, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా దరఖాస్తులు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

Read More