భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను దేశ ప్రజలందరూ బహిష్కరించాలని పిలుపు ఎవరూ స్టేడియానికి వెళ్లి చూడవద్దని, టీవీలు కూడా ఆన్ చేయవద్దన్న ఐశాన్య బీసీసీఐని, క్రికెటర్లను తప్పుబట్టిన ఐశాన్య ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికుడు శుభమ్ ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది దేశ ప్రజలను కోరారు. తమ కుటుంబాల వేదనను విస్మరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. “దయచేసి ఈ మ్యాచ్‌ను బహిష్కరించండి. ఎవరూ స్టేడియానికి వెళ్లవద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా చూడొద్దు” అని ఆమె ప్రజలను కోరారు. బీసీసీఐ, భారత క్రికెటర్ల వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. “ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల…
Read More