ISRO VSSC Apprentice Recruitment 2025:విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్ ఖాళీలు – నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2025–26 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం పూర్తిగా రాత పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు మరియు విద్యార్హతల ఆధారంగా నిర్వహించబడుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో: 23 జనరల్ స్ట్రీమ్ (నాన్-ఇంజినీరింగ్) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 67 డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు డిసెంబర్ 29, 2025 తేదీన జరిగే సెలక్షన్ డ్రైవ్/ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ రోజునే…
Read More