భారత ఐటీ రంగంపై లేఆఫ్స్ కత్తి ఈ ఏడాది 60,000 ఉద్యోగాలకు ముప్పు! టీసీఎస్‌లో 6,000 మందిని తొలగించారంటూ వార్తలు భారత ఐటీ పరిశ్రమలో మరోసారి లేఆఫ్స్ భూతం కోరలు చాస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్టుల కొరత, కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించేందుకు వెనుకాడటం లేదు. ఈ ఏడాది చివరి నాటికి ఏకంగా 50,000 నుంచి 60,000 మంది ఐటీ ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండగా, ఆ ప్రకంపనలు ఇప్పటికే దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో మొదలయ్యాయి. టీసీఎస్‌లో ఏం జరుగుతోంది? పనితీరు బాగోలేదనే నెపంతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా టీసీఎస్ సుమారు 6,000 మంది ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్ర…
Read More