Jagapathi Babu : జయమ్ము నిశ్చయమ్మురా’ వేదికపై జగపతిబాబు తో మీనా

Jayammu Nischayammu Ra

ఆమె లైఫ్ లోని విషాదం గురించి ప్రస్తావన ఫ్రెండ్స్ వలన తేరుకున్నానన్న మీనా కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పట్ల అసహనం  జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో జీ తెలుగులో బాగా పేరు తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే జగపతిబాబుని హోస్ట్‌గా ఎంచుకోవడం, షోను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షోలో ఆయన నటి మీనాతో మాట్లాడిన విషయాలు చాలామందికి కనెక్ట్ అయ్యాయి. జగపతి బాబు, మీనా పలు సినిమాల్లో కలిసి నటించారు కాబట్టి, వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే ఆయన మీనాతో మాట్లాడారు. మీనా భర్తను కోల్పోయిన సమయంలో తాను రాలేకపోయినందుకు జగపతిబాబు క్షమాపణలు చెప్పారు. ఆమె ముఖం చూడటానికి ధైర్యం సరిపోకనే రాలేకపోయానని అన్నారు. అందుకు మీనా స్పందిస్తూ, తాను చాలా బాధలో ఉన్నప్పుడు తన స్నేహితులు…

Read More