ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా రాష్ట్రవ్యాప్త పర్యటన ఆరు హామీల అమలు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రధానంగా దృష్టి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ‘జాగృతి జనయాత్ర’ చేపట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర నాయకులు కోల శ్రీనివాస్, నరేష్, అర్చన సేమపతి హాజరయ్యారు. యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష…
Read More