DSP : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వేణు యెల్దండి ఎల్లమ్మ లో నటించనున్నారా?

Devi Sri Prasad to Star as Hero in Venu Yeldandi's 'Yellamma'? The Hottest Buzz in Tollywood

బలగం తర్వాత వేణు యెల్దండి దర్శకత్వంలో రానున్న ‘ఎల్లమ్మ’ హీరో ఫైనల్ కాకపోవడంతో రెండేళ్లుగా ప్రాజెక్ట్‌లో జాప్యం గతంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న నాని, నితిన్ ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. ఆయన దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో హీరోగా స్టార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) నటించనున్నారంటూ సోషల్ మీడియాలో తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘బలగం’ లాంటి భారీ విజయం తర్వాత వేణు రెండో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన తన గురువు దిల్ రాజు బ్యానర్‌లోనే ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌ను ప్రకటించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా,…

Read More