New Delhi : 4 జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు న్యూఢిల్లీ, జూన్ 5 కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల చేసింది. జులై 21వ తేదీ నుంచి ఆగస్ట్ 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒకవైపు.. ఆపరేషన్ సిందూర్ గురించి చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు.. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే నిబంధనల ప్రకారం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే అన్ని అంశాలపై చర్చించవచ్చని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ తేదీలను…
Read More