హైదరాబాద్ శివారులో ఘనంగా వివాహ వేడుక వెంకటేశ్ బంధువుల అమ్మాయి శివానీతో ఏడడుగులు కుటుంబంతో కలిసి హాజరై సందడి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, టాలీవుడ్ యువ నటుడు నార్నే నితిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే యువతితో ఆయన పెళ్లి శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వధువు వివరాలు: వధువు శివానీ నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది.…
Read More