AP : వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు: ఏపీలో 10 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం

Andhra Pradesh Approves 10 New Medical Colleges Under PPP Model

ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలు కేపీఎంజీ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన అధ్యయన నివేదికలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యను అభివృద్ధి చేయడంలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో మొత్తం 10 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది.వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని స్పష్టంగా పేర్కొంది. మిగిలిన పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలల విషయంలోనూ త్వరలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.…

Read More