కొవ్వు పదార్థాలతో నాలుగే రోజుల్లో జ్ఞాపకశక్తికి ముప్పు ఊబకాయం, మధుమేహం కంటే ముందే మెదడుపై ప్రభావం మెదడులోని ప్రత్యేక కణాలు అతిగా చురుగ్గా మారడమే కారణం మీకు చీజ్బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టమా? అయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక. ఇలాంటి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు కేవలం నాలుగు రోజులు తిన్నా చాలు, అవి నేరుగా మీ మెదడులోని జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఊబకాయం లేదా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు మొదలవ్వకముందే, ఈ జంక్ ఫుడ్ మెదడు పనితీరును దెబ్బతీయడం ఆందోళన కలిగించే విషయం. మెదడులో ఏం జరుగుతుంది? అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC) పరిశోధకులు ఈ పరిశోధన నిర్వహించారు. దీని వివరాలు ప్రఖ్యాత ‘న్యూరాన్’ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.…
Read More