భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం ఉగ్రరూపం దాల్చిన మూసీ నది, ఎంజీబీఎస్‌లోకి వరద బస్టాండ్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది, ఎంజీబీఎస్ బస్టాండ్‌ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్‌లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న…
Read More