పదేళ్లు పూర్తిచేసుకున్న సుకుమార్ రైటింగ్స్ నిర్మాతగా బ్రాండ్ క్రియట్ చేసుకున్న సుకుమార్ దర్శకుడు సుకుమార్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం, ఆయన తన తదుపరి చిత్రం కోసం నటుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ చర్చలు చివరి దశలో ఉన్నాయని, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. ‘రంగస్థలం’ వంటి భారీ విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతగా కూడా సుకుమార్ తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ ఇటీవలే పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంస్థ ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలతో…
Read More