అయోన్-పీఎల్సీ కీలక నివేదిక రియాల్టీ, మౌలిక సదుపాయాలు, ఎన్బీఎఫ్‌సీ రంగాల్లో అధిక వేతన పెంపు ఉండే అవకాశం బలమైన వినియోగం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ విధానాల బాసట ప్రముఖ అంతర్జాతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయోన్-పీఎల్‌సీ (Aon plc) మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026లో భారతదేశంలో వేతనాలు సగటున 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత మందగమనం ఉన్నప్పటికీ, భారత మార్కెట్ బలంగా, సానుకూలంగా ఉన్నట్లు ఈ నివేదిక హైలైట్ చేసింది. భారతదేశంలో బలమైన దేశీయ వినియోగం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు మరియు ప్రభుత్వ విధానాలు వ్యాపార వృద్ధికి, ఉద్యోగ స్థిరత్వానికి తోడ్పడుతున్నాయని అయోన్ నివేదిక పేర్కొంది. రంగాల వారీగా వేతన పెంపు అంచనాలు కొన్ని కీలక రంగాలు సగటు కంటే ఎక్కువ వేతన పెంపును అందించే అవకాశం…
Read MoreTag: #NBFC
TATA : టాటా క్యాపిటల్ ఐపీఓ తేదీలు ఖరారు: ఈ ఏడాది అతిపెద్ద ఇష్యూగా నిలిచే అవకాశం
ఈక్విటీ షేరుకు కనీస ధర రూ. 310 గరిష్ఠ ధర రూ.326 అక్టోబర్ 13న టాటా క్యాపిటల్ లిమిటెడ్ లిస్టింగ్ ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుందని నిపుణుల వెల్లడి జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఐపీఓల ట్రెండ్ ఊపందుకోవడంతో, వరుసగా పెద్ద పెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPOలు) మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా, టాటా గ్రూప్ నుంచి వచ్చిన అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) అయిన టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓకు ముహూర్తం ఖరారైంది. ప్రధాన వివరాలు: సబ్‌స్క్రిప్షన్ తేదీలు: టాటా గ్రూప్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఐపీఓ అక్టోబర్ 6న ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఐపీఓ పరిమాణం: కంపెనీ ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ. 15,511 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది (పాత అంచనా రూ. 17,200 కోట్లు). ప్రత్యేకత:…
Read More