భారత్‌లో అంటువ్యాధులను మించిపోయిన అసంక్రమిత వ్యాధులు మరణాలకు ప్రధాన కారణంగా నిలిచిన గుండె సంబంధిత వ్యాధులు 1990తో పోలిస్తే గణనీయంగా తగ్గిన మరణాల రేటు, పెరిగిన ఆయుర్దాయం భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక చారిత్రక పరివర్తన జరిగింది. దశాబ్దాలుగా లక్షలాది ప్రాణాలను బలిగొన్న క్షయ, డయేరియా, న్యుమోనియా వంటి సంక్రమిత వ్యాధుల (Communicable Diseases) యుగం ముగిసింది. వాటి స్థానంలో ఇప్పుడు జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక, అసంక్రమిత వ్యాధులు (Non-Communicable Diseases – NCDs) దేశ ప్రజారోగ్యానికి ప్రధాన ముప్పుగా పరిణమించాయి. అభివృద్ధి చెందుతున్న దేశానికి సంకేతంగా నిలిచిన పాత శత్రువులు తెరమరుగై, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల దీర్ఘకాలిక సమస్యలు వంటి ‘నిశ్శబ్ద కిల్లర్స్’ నేడు భారతీయుల పాలిట మృత్యుదేవతలుగా మారాయి. ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ ప్రచురించిన ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్…
Read More