ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ అక్టోబర్ 30 Ayushman Bharat 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. పేద, ధనిక అనే ఎలాంటి తారతమ్యం లేకుండా దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి. నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల టీకా కోసం ఉద్దేశించిన యు-పోర్టల్(U-WIN)ను కూడా ప్రధాని ఈ…
Read MoreTag: New Delhi
Justice Sanjiv Khanna | నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు | Eeroju news
నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు న్యూఢిల్లీ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Justice Sanjiv Khanna భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొదటి ప్యూస్నే న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఖన్నా, ప్రస్తుత సీజేఐ , DY చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత నవంబర్ 11న ఆ పదవిని చేపట్టనున్నారు. చంద్రచూడ్ గతంలో జస్టిస్ ఖన్నా పేరును తుదిపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. ప్రస్తుత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 8, 2022న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఖన్నా…
Read MoreDelhi Air Pollution Alert | ఢిల్లీలో డేంజర్ బెల్స్… | Eeroju news
ఢిల్లీలో డేంజర్ బెల్స్… న్యూఢిల్లీ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Delhi Air Pollution Alert ఢిల్లీలో కాలుష్య స్థాయి మరింత ప్రాణాంతకంగా మారింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య తీవ్రతతో కళ్ల మంటలు, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది.ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 2 ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రీన్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ ఆన్, వెహికల్ ఆఫ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతోంది. ఇందుకోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి…
Read MorePM Modi- Xi Jinping | ఐదేళ్ల తర్వాత మోదీ..జిన్‌పింగ్ భేటీ | Eeroju news
ఐదేళ్ల తర్వాత మోదీ..జిన్‌పింగ్ భేటీ ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు.. ఢిల్లీ, PM Modi- Xi Jinping భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం అక్టోబర్ 23, కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో సమావేమయ్యారు. ఇద్దర మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఇరువురి మధ్య సరిహద్దు వివాదంతోపాటు పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గతంలో 11 అక్టోబర్ 2019న ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. ఆ తర్వాత తాజాగా రష్యాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ తమ మొదటి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…
Read MoreSupreme Court | మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే | Eeroju news
మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే న్యూఢిల్లీ అక్టోబర్ 21 Supreme Court మదర్సాల విషయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసేయాలని కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న తదుపరి చర్యలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. యూపి, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. యూపి ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ జామియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి. పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి నోటీసు…
Read MoreIndian Railways | ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైము మార్పు.. 60 రోజులకు కుదింపు | Eeroju news
ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైము మార్పు.. 60 రోజులకు కుదింపు న్యూఢిల్లీ అక్టోబర్ 18 Indian Railways ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ బుకింగ్ టైమును మార్చింది. ఇదివరలో 120 రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు దానిని 60 రోజులకు కుదించింది. కాగా దీని ప్రభావం నేడు ఐఆర్ సిటిసి షేర్ ట్రేడింగ్ మీద పడింది. మధ్యాహ్నం 2.20 గంటలకు 2.2 శాతం పడిపోయి రూ. 867.60 వద్ద ఒక్కో షేరు ట్రేడయింది.ఇండియన్ రైల్వే వారి కొత్త రూల్ 2024 నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ నవంబర్ 1 కన్నా ముందుగా కొన్న టికెట్లకు ఈ కొత్త రూల్ వర్తించదు. 2024-25లో భారత రైల్వేస్ 7.5 బిలియన్ల మంది ప్యాసంజర్లను రవాణా చేసింది. అది గత…
Read MoreSheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ | Eeroju news
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ న్యూ డిల్లీ అక్టోబర్ 18 Sheikh Hasina బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారడంతో ఆమె దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆమె నివాసంపై దాడి చేస్తారని తెలుసుకున్న హసీనా రహస్యంగా ప్రత్యేక హెలిక్యాప్టర్ లో దేశం వడిచి భారత్ కు వచ్చి తలదాచుకుంటోంది. దీంతో హసీనా ప్రభుత్వం అర్థాంతరంగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఉన్నారు. దేశ పాలనను చేతుల్లోకి బంగ్లా ఆర్మీ.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంది. అనంతరం నోబెల్ విజేత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసేందుకు సిద్ధమైంది.…
Read MorePredator drones | భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్ డ్రోన్లు | Eeroju news
భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్ డ్రోన్లు న్యూఢిల్లీ, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Predator drones ప్రిడేటర్ డ్రోన్లు చాలా సామర్థ్యం కలిగినవి. అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణతో పాటు ఈ ప్రెడెటర్ డ్రోన్లు శత్రువును గుర్తించి దాడి చేయగలవు. వాస్తవానికి యుద్ధ భూమిలో సమాచారం ప్రాణవాయువు లాంటిది. కచ్చితమైన టార్గెట్ ను ఎంచుకుని దాడి చేయడానికి సహకరించడంతోపాటు.. ఆయుధాల వృథాను అరికడుతాయి. తాజాగా కొనుగోలు చేసిన ప్రిడేటర్లు దేశ సరిహద్దుల్లో భారత్‌కు ఆధిపత్యాన్ని అందించనున్నాయి. సముద్ర తీరాల్లోనే కాదు.. హిమాలయ శిఖరాల్లో మన సైన్యానికి కొత్త బలాన్ని తీసుకురానున్నాయి. ఇప్పటికే చైనా వద్ద చియాహాంగ్-4, వింగ్‌లంగ్-2.. దాయాది దేశం పాకిస్థాన్ వద్ద షహపర్-2, వింగ్‌లంగ్-2, బైరక్తర్ టీబీ2 వంటి డ్రోన్‌లు ఉన్నాయి. భారత్ వద్ద ఇప్పటి వరకు ఈ స్థాయి యూఏవీలులేవు. కానీ, ప్రస్తుత ప్రెడేటర్ల రాకతో, వద్ద…
Read MorePriyanka | వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక | Eeroju news
వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక న్యూఢిల్లీ, అక్టోబరు 16,(న్యూస్ పల్స్) Priyanka మరో కీలక ఎన్నికల సమరానికి నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలతో పాటు కీలకమైన వయనాడు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 13న వయనాడు పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న వయనాడు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందిఈసారి కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు వయనాడు పార్లమెంట్ ఉప ఎన్నిక ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండటమే. గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడుతో పాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో…
Read MoreCEC Rajeev Kumar | ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. | Eeroju news
ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన సీఈసీ రాజీవ్‌కుమార్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) CEC Rajeev Kumar మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలవేళ ఈవీఎం లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్‌కుమార్.. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్‌పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.…
Read More