లాంగ్ కోవిడ్ బాధితుల్లో అరుదైన గుండె సమస్య గుర్తింపు ‘పాట్స్’ అనే రుగ్మత బారిన పడుతున్నారని స్వీడన్ పరిశోధనలో వెల్లడి మధ్యవయస్కులైన మహిళల్లోనే ఈ సమస్య అధికం స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో, లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్నవారిలో, ముఖ్యంగా మధ్యవయస్కులైన మహిళల్లో, పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాకీకార్డియా సిండ్రోమ్ (పాట్స్ – POTS) అనే అసాధారణ గుండె సంబంధిత రుగ్మత ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. పాట్స్ అంటే ఏమిటి? ‘పాట్స్’ అనేది ఒక ఆరోగ్య సమస్య. పడుకున్న స్థితి నుంచి నిలబడినప్పుడు గుండె వేగం అసాధారణంగా పెరుగుతుంది. ఈ రుగ్మత ఉన్నవారికి నిలబడటం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీని లక్షణాలు: తీవ్రమైన అలసట, ఏకాగ్రత లోపించడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం. ఈ లక్షణాలు లాంగ్ కోవిడ్ లక్షణాలను పోలి ఉంటాయి.…
Read More