రన్నర్లు, సైక్లిస్టుల కోసం ‘ఓక్లే మెటా వాన్గార్డ్’ స్మార్ట్ గ్లాసెస్ విడుదల 12 ఎంపీ కెమెరా, 3కే వీడియో రికార్డింగ్ సదుపాయం గార్మిన్, స్ట్రావా వంటి ఫిట్నెస్ ప్లాట్‌ఫామ్స్‌తో అనుసంధానం టెక్నాలజీ దిగ్గజం మెటా క్రీడాకారులు, అవుట్డోర్ యాక్టివిటీస్ ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుని సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ గ్లాసెస్‌కు ‘ఓక్లే మెటా వాన్గార్డ్’ అని పేరు పెట్టారు. మెటా తన వార్షిక ‘మెటా కనెక్ట్ 2025’ ఈవెంట్లో వీటిని విడుదల చేసింది. మూడు నెలల క్రితం వచ్చిన ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ మోడల్‌కు కొనసాగింపుగా, మరిన్ని అధునాతన ఫీచర్లతో వీటిని రూపొందించారు. ధర, లభ్యత ఈ స్మార్ట్ గ్లాసెస్ ధర సుమారుగా రూ. 43,500 ($499)గా నిర్ణయించారు. అక్టోబర్ 21 నుంచి అమెరికా, యూకే, కెనడా సహా 17 దేశాల్లో ఇవి…
Read More