పితృస్వామ్య మనస్తత్వంపై ఇన్‍స్టాలో సుదీర్ఘ పోస్ట్ మహిళలను ఇంకా ఆస్తిగానే చూస్తున్నారంటూ ఆవేదన ఫెమినిజం అంటే ఇదేనంటూ గట్టిగా బదులు సినీ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమెను అభివర్ణిస్తూ ఒక అభిమాని చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ రాశారు. ఈ పోస్ట్‌లో సమాజంలో మహిళల పట్ల ఉన్న పితృస్వామ్య ధోరణిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే? సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్‌కు ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు కామెంట్ చేశారు. “మిమ్మల్ని మేము ఇంకా పవన్ కళ్యాణ్ భార్యగానే…
Read More