ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా మోదీ ఎక్స్ (X)లో పోస్టు చేస్తూ,“శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అనేకమంది ప్రజల హృదయాలలో, మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మంచి పాలనపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో NDAని బలోపేతం చేస్తున్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. సినీ రంగంలో పవర్ స్టార్గా పేరు తెచ్చుకుని, ప్రజా జీవితంలోనూ విశేషమైన ప్రభావాన్ని చూపారు. ‘తోలి ప్రేమ’ (1998), ‘ఖుషి’ (2001), ‘గబ్బర్ సింగ్’ (2012), ‘అత్తారింటికి దారేది’…
Read More