ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యాచరణ రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి ప్రణాళిక వెల్లడి రాజకీయ నాయకుల నుంచే మార్పు మొదలవ్వాలని పిలుపు ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో పటిష్టమైన ప్రణాళికను తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగమైపోయిందని, దీనికి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుందని, ఇది మైక్రో, నానో పార్టికల్స్ రూపంలో పశువుల కడుపులోకి, చివరికి శిశువుల రక్తంలోకి కూడా చేరుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం…
Read More