RGV : రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు: ‘దహనం’ వెబ్ సిరీస్‌తో మరో వివాదం

Ram Gopal Varma Lands in Trouble Again Over 'Dahanam' Series

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీపై మరో కేసు ‘దహనం’ వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు అనుమతి లేకుండా తన పేరు వాడారని అంజనా సిన్హా ఆరోపణ సంచలనాలకు, వివాదాలకు పెట్టింది పేరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన తీసిన ‘దహనం’ వెబ్ సిరీస్‌ విషయంలో ఆయనపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: ‘దహనం’ అనే వెబ్ సిరీస్‌లో మావోయిస్టుల నేపథ్యం ఉంటుంది. ఈ సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన పేరును వాడేశారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆరోపించారు. ఈ విషయంలో ఆమె స్వయంగా పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.…

Read More